పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనాలని అనుకువారికి ఇది చక్కటి సమయం.. నాలుగు రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు నిలకడగానే కొనసాగింది. పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంది. పసిడి రేటు పెరగకపోవడం బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు మాత్రం భారీగా కిందకు పడిపోయాయి. ఈ రోజు ధరలు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో మహిళలు దుకాణాల వద్ద బారులు తీరారు..ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి..  


ఇకపోతే.. హైదరాబాద్ మార్కెట్‌ లో గురువారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.49,590 వద్దనే కొనసాగుతోంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.45,450 వద్ద స్థిరంగా ఉంది... బంగారం ధరలు పెరిగితే.. వెండి కూడా అదే దారిలో నడిచాయి..

 
ఈరోజు వెండి ధర తగ్గింది. రూ.1000 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.77,500 కు దిగొచ్చింది. అంటే తులం వెండి ధర దాదాపు రూ.775 వద్ద ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా వెండి ధర వెలవెలబోయింది. నేలచూపులు చూసింది.  ఇక బంగారం అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.50 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1871 డాలర్ల కు తగ్గింది. వెండి ధర ఔన్స్‌ కు 0.85 శాతం తగ్గుదలతో 27.78 డాలర్లకు క్షీణించింది.. బంగారం ధరల పై ఎన్నో పరిస్థితులు ఉన్నాయని మార్కెట్  నిపుణులు అంటున్నారు. మరి రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: