గత కొద్దీరోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర వరుసగా నాలుగోరోజు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,600 అయింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో ఇటీవల స్వల్పంగా పుంజుకున్న బంగారం ధర స్థిరంగా మార్కెట్ అవుతోంది. తాజాగా ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,830 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,930గా ఉంది.
పసిడి ధరలు పరుగులు పెడుతుంటే వెండి ధరలు మాత్రం కిందకు దిగి వస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో వెండి ధర వరుసగా నాలుగో రోజు దిగొచ్చింది. వెండి ధర రూ.1,100 మేర పతనం కావడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,100కు పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.700 మేర పతనమైంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.75,700 వద్ద కొనుగోళ్లుచేస్తున్నారు . పసిడి ధరలపై ప్రభావాన్ని చూపించడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..