
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.49,750 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.45,600 వద్ద నిలకడగా ఉంది.. బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.76,000 వద్దనే ఉంది. వెండి వస్తువులు, ఆభరణాలు వంటివి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పాలి..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 0.03 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1889 డాలర్లకు ఎగసింది. వెండి రేటు కూడా పెరిగింది. ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 28.11 డాలర్లకు చేరింది.బంగారం ధరలు పెరగడానికి తగ్గడానికి ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి మార్కెట్ లో రేపటి ధరలు ఎలా నమోదు అవుతాయో చూడాలి..