హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. బంగారం ధరల దారి లోనే వెండి కూడా పరుగులు పెట్టింది. బుధవారం రూ.600 పెరిగింది. ఇక నిన్న హైదరాబాద్‌లో కిలో వెండిపై ఏకంగా 4 వేలకుపైగా తగ్గుముఖం పట్టగా, బుధవారం మాత్రం మళ్లీ భారీగా పెరిగింది. కిలో వెండి ధరపై రూ.4,800 పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,800 వుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర దిగొచ్చింది. 0.03 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1904 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు కూడా ఇదేదారిలో పయనించింది. ఔన్స్‌కు 0.24 శాతం క్షీణతతో 28.03 డాలర్లకు దిగొచ్చింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభవాన్ని చూపిస్తున్నాయి... మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..