ప్రస్తుతం పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి.. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి.ఒకవైపు కరొనా ఉన్న కూడా మరో వైపు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. దాంతో ధరల్లొ మార్పులు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకూ భారీగా పెరిగిన ధరలు నేటి మార్కెట్ లో మాత్రం కాస్త్ ఊరట కలిగిస్తున్నాయి.. ఈరోజు మార్కెట్ లో ధరలు నిలకడగా ఉన్నాయి.ఇది పసిడి కొనాలనుకునేవారికి కాస్త ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు.


ఇకపోతే హైదరాబాద్‌ మార్కెట్ లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,070 గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్ల లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900 ఉంది. అలాగె 24 క్యారెట్ల బంగారం 50,070 గా కొనసాగుతోంది.. ఇది నిజం గానే గుడ్ న్యూస్ అనే చెప్పాలీ.. కాగా , వెండి ధరలు మాత్రం కిందకు దిగి వచ్చాయి..నిన్న వెండి ధరలు కాస్త పెరిగి కేజీ సిల్వర్ రేట్ రూ. 71,700 ఉండగా.. నేడు కేజీ సిల్వర్ రేట్ రూ. 71,400గా ఉంది.


ఇలా చూస్తె తులం 714 రూపాయలు ఉంది. వెండి వస్తువులు, ఆభరణాలు చేయించుకోవాలి అనుకునేవారికి ఇది అనుకూలమైన సమయం.. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్ బంగారం, వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి.బంగారం ధర పడిపోయింది. 0.26 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌ కు 1890 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌ కు 0.54 శాతం తగ్గింది. బంగారం, వెండి ధరలు ఒక్కో రోజు ఒక్కొలా మారుతుంది. వీటి ధరల పై ప్రభవాన్ని చూపించె అంశాలు చాలానె ఉన్నాయి. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: