పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు కూడా బంగారం ధరలు కిందకు వచ్చాయి. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతున్న బంగార ధరలు నేటి మార్కెట్ లో కూడా స్వల్పంగా పడిపోయాయి. ఇది ఈరోజు బంగారం కొనాలని అనుకునేవారికి మంచి వార్త అనే చెప్పాలి. వరుసగా వారం రోజుల నుంచి పసిడి ధర పతనం అవుతుంది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ మాత్రం ఈరోజు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి .


హైదరాబాద్ మార్కెట్ లో  సోమవారం పసిడి ధరలు పరిశీలిస్తే.. బంగారం ధర ఒక్క సారిగా పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 తగ్గుముఖం పట్టింది. దీంతో ఈరోజు పసిడి ధర రూ.47,990 కు చేరింది. కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అదే విధంగా కొనసాగింది. రూ. 260 క్షీణించింది. దీంతో బంగారం ధర రూ.43,990 కు పడిపోయింది. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. గత కొద్దీ రోజులు గా వెండి కూడా భారీగా తగ్గుతుంది.


ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర తగ్గింది. ఏకంగా ఈరోజు 900 వరకు తగ్గింది. దీంతో వెండి ధర రూ.73,100కు దిగొచ్చింది. వెండి వస్తువులు చేయించుకోవాలని భావించే వారికి ఇది సరైన సమయం. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి పరుగులు పెట్టింది. 1772 డాలర్ల కు ఎగసింది. వెండి రేటు కూడా ఇదే దారి లో నడిచింది. 25.99 డాలర్లకు పైకి కదిలింది. బంగారం ధరల్లో మార్పులు అనేవి మార్కెట్ లోని ప్రభావం పై ఆధారపడి ఉంటుంది. కరోనా పరిస్థితులు మార్కెట్ ను పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఏ విధంగా నమోదు అవుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: