ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో నిన్న పసిడి ధరలు పరుగు పెట్టిన సంగతి తెలిసిందే.. నేడు మార్కెట్ లో మాత్రం ధరలు కిందకు దిగి రావడం గమనార్హం.. హైదరాబాద్ మార్కెట్ లో గురువారం పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. రూ.48,110 రేటుతో కొనసాగుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.44,100 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధరల్లో మార్పు లేకున్నా.. వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి.
ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర 400 పెరిగింది.. 73,500 వద్ద వెండి రేటు కొనసాగుతుంది. వెండి వస్తువులను కొనాలని భావించేవారికి ఇది చేదు వార్తే అని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ దిగొచ్చిన బంగారం మరియు వెండి ధరలను చూస్తే.. పసిడి రేటు ఔన్స్‌కు 1777 డాలర్లకు తగ్గింది. వెండి రేటు మాత్రం 25.93 డాలర్లకు పడిపోయింది. బంగారం ధరల పై కరోనా ప్రభావం కాస్త ఎక్కువగా ఉందని చెప్పాలి. అందుకే మార్కెట్ ధరలు మారుతున్నాయని చెప్పాలి.
బంగారం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ..
ఆంధ్ర ప్రదేశ్ లో బంగారం గనులు ఉన్నాయి. రాష్ట్రంలో బంగారు గనులు తవ్వకానికి అనుమతులు దక్కించుకుంది ఓ ప్రైవేటు సంస్థ. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు సిద్ధం అవుతుంది. ఈ గనులను తవ్వడానికి 1500 ఎకరాలను లీజుకు తీసుకోనుంది ప్రముఖ ఆస్ట్రేలియన్ కంపెనీ.. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే మన దేశంలో గనులు ఉండి, తీసుకోకుండా ఆస్ట్రేలియన్ కంపెనీ ఆ గనులను వెలికి తీస్తుంది. అందుకే ఈరోజున బంగారం ధరలు పెరుగుతున్నాయి.