10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.43,990, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.47,990.

గోల్డ్ ఇటిఎఫ్‌లలో వ్యాపారం చేయాలంటే ముందుగా డీమ్యాట్ ఖాతాను తెరవాలి. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాతో బ్రోకర్ ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం ఇటిఎఫ్‌ లను కొనడానికి లేదా విక్రయించడానికి ఇది సురక్షితమైన మార్గం.

గోల్డ్ ఇటిఎఫ్‌ల ప్రయోజనాలు
బంగారు ఆభరణాలను కొనేటప్పుడు చాలా మంది దాని స్వచ్ఛత గురించి ఆందోళన పడుతుంటారు. గోల్డ్ ఇటిఎఫ్‌ లలో ట్రేడ్ చేస్తున్నప్పుడు ప్రతి యూనిట్ అత్యధిక స్వచ్ఛత కలిగిన ఫిజికల్ గోల్డ్ తో సమానంగా ఉంటుంది కాబట్టి స్వచ్ఛత గురించి చింతించాల్సిన పని లేదు.
బంగారాన్ని పెట్టుబడి ఎంపికగా ఉపయోగించాలనుకునే వారికి గోల్డ్ ఇటిఎఫ్‌లు అనువైనవి.
బంగారు నాణేలు, బార్లు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తే నిల్వ, భద్రత గురించి చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. దొంగతనం నుంచి రక్షించడం, నిల్వ చేయడం కష్టం.
ఇది డీమెటీరియలైజ్డ్ రూపంలో ఉంటుంది కాబట్టి బంగారం అమ్మడం లేదా కొనడం సులభం, అత్యంత సురక్షితం.
గోల్డ్ ఇటిఎఫ్‌లు పారదర్శకంగా ఉంటాయి
ఫిజికల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టడం, ముఖ్యంగా ఆభరణాల ద్వారా అంటే 10-20 శాతం ఛార్జీలు కట్టాలి.
లిక్విడిటీ పరంగా, గోల్డ్ ఇటిఎఫ్‌లు భౌతిక బంగారం కంటే భారీ ప్రయోజనాన్ని అందిస్తాయి.
మీరు కేవలం ఒక డీమ్యాట్ ఖాతాను తెరిచి ట్రేడింగ్ ప్రారంభించాలి.
అదే ఆభరణాలు అయితే మీరు లావాదేవీల కోసం ఒక స్టోర్‌ని సందర్శించాలి.
బంగారం ఇటిఎఫ్ ట్రేడింగ్ గంటల సమయంలో జరిగేది. అంతేకాదు తక్కువ లావాదేవీలు, ఖర్చులు. మీరు మీ ట్రేడింగ్ ఖాతా ద్వారా గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసినప్పుడు/విక్రయించినప్పుడు ఎంట్రీ/ఎగ్జిట్ లోడ్ ఉండదు.
గోల్డ్ ఇటిఎఫ్‌లలో వ్యాట్, అమ్మకపు పన్ను లేదా సంపద పన్ను ఉండదు. అలాగే గోల్డ్ ఇటిఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం పన్ను సమర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే వాటి నుండి మీరు సంపాదించే ఏ ఆదాయం అయినా దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించబడుతుంది.
రుణం తీసుకోవాలనుకుంటే గోల్డ్ ఇటిఎఫ్‌లను రుణాల కోసం ఉపయోగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: