బులియ‌న్ మార్కెట్‌లో ప‌సిడి ధ‌ర‌ల‌లో ప్ర‌తీ రోజు మార్పులు, చేర్పులు త‌ప్ప‌కుండా ఉంటుంటాయి. మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు ఒక్కోసారి త‌గ్గితే.. మ‌రికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగోలు దారులంద‌రూ వాటి ధ‌ర‌ల‌వైపు ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతుంటారు. అయితే కొన్ని రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. క‌రోనా నూత‌న వేరియంట్ అయిన ఒమిక్రాన్ భ‌యాల‌తో బంగారం ధ‌ర‌ల‌పై అధిక ప్ర‌భావం చూపుతుంద‌ని, దీని కార‌ణంగా ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. మంగ‌ళ‌వారం దేశంలోని ప‌లు న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లు ్వ‌ల్పంగా పెరిగాయి. అదేవిధంగా ప‌లు న‌గ‌రాల‌లో స్వ‌ల్పంగా త‌గ్గాయి కూడా.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.47,400 ఉండ‌గా.. అదే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.51, 710గా ఉంది. దేశ ఆర్థిక రాజ‌ధాని అయిన ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 47,250 ఉంటే.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 49,250 వ‌ద్ద కొన‌సాగుతుంది. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.45,500 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,640 వ‌ద్ద కొన‌సాగుతొంది. ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌దాని కోల్‌క‌తాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర 47,450 కొన‌సాగ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,150 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది.

క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.45,250 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,360 ఉన్న‌ది. కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధ‌ర 45,250 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర 49, 360గా ఉన్న‌ది. ఇక తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర 45,250 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,360 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.45,250 గా ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాఉల ద‌ర 49,360 వ‌ద్ద కొన‌సాగుతుంది. విశాఖ‌ప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర 45,250 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర 49,360 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: