బులియ‌న్ మార్కెట్‌లో ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తిరోజు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయ‌నే విష‌యం విధిత‌మే మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు ఒక్కోసారి త‌గ్గితే. మ‌రికొన్ని సార్లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే కొనుగోలు దారులంద‌రూ వాటి ధ‌ర‌ల‌వైపు ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తుంటారు. తాజాగా 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.180 వ‌ర‌కు త‌గ్గింది. గురువారం దేశంలోని ప‌లు న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లు  ఈ విధంగా ఉన్నాయి.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.47,300 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.51,580 గా కొన‌సాగుతూ ఉంది. దేశ ఆర్థిక రాజ‌ధాని అయిన ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 47,080 ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.49,080 వ‌ద్ద ఉన్న‌ది. ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,250 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,950 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది. క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.45, 150 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49, 250 ఉంది.


కేర‌ళ‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధ‌ర 45, 150 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.49,250 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర 45,150 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 49, 250 వ‌ద్ద కొనుగుతున్న‌ది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.45, 150 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర 49,250 వ‌ద్ద కొన‌సాగుతుంది.

బంగారం ధ‌ర కాస్త త‌గ్గితే.. వెండి ధ‌ర మాత్రం కాస్త పెరిగింది. దేశీయంగా కిలో వెండి 61,700 ఉన్న‌ది.
దేశ రాజ‌ధాని ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ.62,300గా ఉన్న‌ది. ముంబ‌యిలో కిలో వెండి ధ‌ర రూ.62,300, చెన్నైలో రూ.66,100, బెంగ‌ళూరులో కిలోవెండి రూ.62,300, కేర‌ళ‌లో 66,100, ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో కిలో వెండి ధ‌ర రూ.66,100 ఉండ‌గా.. ఏపిలోని విజ‌య‌వాడ‌లో కిలోవెండి రూ.66,100, విశాఖ‌ప‌ట్ట‌ణంలో కూడా 66,100 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది.




మరింత సమాచారం తెలుసుకోండి: