
ఏకంగా 50 వేల మార్కును క్రాస్ చేయడంతో మహిళలు మరియు బంగారు ప్రియులు నివ్వెరపోతున్నారు. తాజాగా బంగారం ధరలే కాదు, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల ఎలా ఉన్నాయి అంటే... హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 190 కు పెరగగా మొత్తం విలువ... రూ. 50,100 కు చేరి కూర్చుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 150 పెరిగి.. రూ. 45, 900 కు చేరింది. బంగారం పెరిగింది అని అనుకుంటే వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి ధర నిన్నటి తో కంటే ఇవాళ రూ. 300 పెరిగింది.
దాంతో మొత్త ఒక కేజీ వెండి ధర రూ. 68,500 పలుకుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగేలా సూచనలు అందుతున్నాయి . మరి బంగారు ప్రియులు బంగారం కొనే జోరును ఇలాగే కొనసాగిస్తారా లేక తగ్గుతుందని కొద్ది రోజులు వెయిట్ చేస్తారో చూడాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బంగారం ఇక పెరగడమే కానీ తగ్గే అవకాశం లేదంట. అందుకే ఎవరైనా బంగారం కొనదలిస్తే ఈ వరం లోపు కొనాలని మార్కెట్లు సూచిస్తున్నాయి...