బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో మనం చెప్పాలేము.. మార్కెట్ రేటును బట్టి ధరల లో వ్యత్యాసాలు కూడా ఉంటాయి..నిన్న వున్న మార్కెట్ ధరలు నేడు వుండవు. విదేశీ మార్కెట్ లో బంగారం రెట్లు పై మన దేశంలో ధరలు ఆధారపడుతూంది. నిన్న తగ్గిన రేట్లు ఈరోజు కూడా నిలకడగానే ఉన్నాయి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఒకరకంగా చెప్పాలంటే మహిళల కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి వస్తువులు కొనుగోలు చేయాలనీ అనుకునేవారికి ఇది మంచి సమయం అని చెప్పాలి.


అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి నిల్వలు ఎలా ఉన్నాయో భారత దేశంలో కూడా ధరల లొ మార్పులు వస్తున్నాయి. దేశం లో ఈరోజు బంగారం ధరలు నిలకడగా ఉండగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. వెండి కిలోకు రూ.100 లు దిగి వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం... 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 45,800 రూపాయలు గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,970 రూపాయలుగా ఉంది.


హైదరాబాద్ లో కిలో వెండి ధర 66,900 రూపాయలుగా కొనసాగుతుంది.. ఇకపోతే విదేశీ మార్కెట్‌ లో బంగారం ధర దిగొచ్చింది. 0.28 శాతం తగ్గింది. ఈ మేరకు పసిడి రేటు ఔన్స్‌ కు 1785 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు కూడా ఇదే దారిలో కొనసాగుతుంది.. ఔన్స్‌ కు 0.28 శాతం తగ్గుదలతో 28.15 డాలర్లకు క్షీణించింది.. ద్రవ్యోల్బణం, కేంద్రం బ్యాంక్‌ల వద్ద బంగారం నిల్వలు తగ్గడం తో పసిడి రేట్లు కూడా మనదేశం లో మారుథున్నాయి. మరి రేపు పసిడి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: