
ఇక వీటితో బాటుగా స్టాక్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర కూడా 1950 డాలర్లకు పెరిగిపోయింది.. దీంతో సుమారుగా 13 నెలల తర్వాత ఇదే గరిష్ఠ స్థాయికి చేరడం గమనార్హం. బంగారం త్వరలోనే మరింత రేట్ ఎక్కువగా ($1950-$2000) పెరిగిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బులియన్ జువెలరీస్ ప్రకారం.. రాజధాని అయినటువంటి ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బిస్కెట్ ధర..1,300 వందల రూపాయల వరకు పెరిగింది.. దీంతో బంగారం ధర 51,419 చేరుకుంది.. ఇక మనం ఆభరణాలుగా ఉపయోగించుకునే 22 క్యారెట్ల బంగారం ధర 45,870 రూపాయల నుంచి 47,100 రూపాయలకు చేరుకుంది.
ఇక హైదరాబాదులో కూడా మార్కెట్ లోని బంగారు ధరలు భారీగా పెరిగిపోయాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజున ఒక్కరోజులోనే 850 రూపాయలు పెరిగిపోయింది.. ఇక గోల్డ్ బిస్కెట్ ధర కూడా 930 రూపాయలకు పైగా పెరిగిపోయింది.. ఇక బంగారం వెంటే వెండి కూడా అమాంతం పైకి పెరిగిపోతూ వస్తోంది. ఇక ఈ రోజున ఒకేసారి 2,300 రూపాయల వరకు పెరిగి.. ప్రస్తుతం 66,501 రూపాయలకు చేరుకున్నది.. బంగారం, వెండి ధరలు అనేవి ఎప్పుడు అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి.. దీంతో సామాన్య ప్రజలు బంగారం కొనాలంటే భయపడుతున్నారు. ఇక అందుకే బంగారం ధరలు మరింత తగ్గే వరకు సామాన్య ప్రజలు ఎదురుచూడక తప్పదు అని చెప్పవచ్చు.