పసిడి ప్రియులకు భారీ షాక్.. ఈరోజు పసిడి ధరలు పైకి కదిలాయి. నిన్నటి ధర తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పెరిగాయి. ఇది మహిళలకు చేదు వార్త అనే చెప్పాలి.ఉక్రెయిన్ – రష్యా యుద్ధాల నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ధరలు నిలకడగా ఉన్నాయని తెలుస్తుంది.మొత్తానికి ఈరోజు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. వెండి కూడా అదే దారిలో నడుస్తుంది.
10 గ్రాముల బంగారం పై 720 రుపాయాలు పెరిగింది. ప్రధాన నగరాల్లొ పసిడి ధరలను ఒక చుద్దాము...దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.47,000 ఉంది.., అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. కాగా,ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 వుంది, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 కు పెరిగింది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 పైకి కదిలింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి వెల రూ.47,000 గా ఉంది.. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద నేడు నమోదు అయ్యింది. ఇది ఇలా ఉండగా.. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000గా ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతున్నాయి.. ఇక వెండి ధర చూస్తె..కిలో వెండి ధర రూ. 69,900 వద్ద కొనసాగుతోంది. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటుందో చూడాలి.