పసిడి ధరలు నేడు మార్కెట్ లో పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.. నిన్న మార్కెట్ లో బంగారం ధరలు కాస్త ఊరట ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది బంగారం కొనేవారికి భారీ షాక్ అనే చెప్పాలీ.. రష్యా- ఉక్రెయిన్ లో జరిగిన యుద్ధం కారణంగా మన దేశంలో ప్రధాన వనరుల పై ధరలు రోజు రోజుకు భారీ పెరిగి పోతూన్నాయి. ఈ మేరకు పసిడి ధరలు కూడా అమాంతం పైకి చేరాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు మార్కెట్ లో 1000 రూపాయలు పైగా పెరిగింది. మార్కెట్ లో బంగారం వైపు చూసెవాల్లు ఒక్కరూ కూడా లేక పోవడం గమనార్హం..


పసిడి ధరలు పరుగులు పెడితే అదే దారిలో వెండి కూడా పరుగులు పెట్టింది.వెండి రేటు ఏకంగా రూ.2 వేలకు పైగా పెరిగింది. దీంతో బంగారం వెండి కొనాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలీ. ఇకపోతే ప్రముఖ నగరాల్లో ధరలను చూస్తె.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నేడు బంగారం ధరలు పరుగులు పెట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,090 పైకి కదిలింది. కాగా, ఇప్పుడు పసిడి రేటు రూ. 53,890కు పెరిగింది.. అదే మాదిరిగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ. 1000 పెరుగుదలతో రూ. 49,400వద్ద నమోదు అవుతుంది.


బంగారం ధరల పైకి కదలగా,వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ.2,300 పెరిగింది. దీంతో సిల్వర్ రేటు రూ. 75,700కు ఎగిసింది. ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా నేడు పరుగులు పెడుతోంది. ఇక ఔన్స్‌కు 0.03 శాతం పెరిగింది.దాంతో పసిడి రేటు ఔన్స్‌కు 2002 డాలర్లకు పెరిగింది. బంగారం పెరిగితే వెండి కూడా ఇదే దారిలో పరుగులు పెడుతోంది. వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 25.85 డాలర్లకు చేరుకుంది.. కాగా, గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు మొదలగు అంశాలు బంగారం ధరల పై ప్రభావాన్ని చూపిస్తాయి. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: