ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము...10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 51,600 వద్ద నమోదు అయ్యాయి. అదే మాదిరిగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. పసిడి రేటు రూ. 47,300 వద్దనే స్థిరంగా ఉంది. బంగారం ధరలు నిలకడగా ఉంటే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. దాంతో వెండి ధర రూ. 72,300 వద్దనే ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే
ధరలు కొనసాగుతున్నాయి..
ఇకపోతే అంతర్జాతీయ స్థాయి మార్కెట్ లో పసిడి వెండి ధరలు భారీగా తగ్గాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.ఔన్స్‌కు 0.06 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1920 డాలర్లకు దిగి వచ్చింది.. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా కిందకు వచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.17 శాతం తగ్గుదలతో 25.13 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా మన దేశంలో పసిడి నిలకడగా కొనసాగడం గమనార్హం.. బంగారం ధరల పై ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ పరిస్థతులు ప్రభావాన్ని చూపిస్తాయి. మరి రేపు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..