బంగారం కొనాలని అనుకుంటూన్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి. నిన్న ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా కిందకు దిగి వచ్చినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. గురువారం మార్కెట్ లో కొనుగోల్లు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. బంగారం ధరలు భారీగా తగ్గితే.. అదే దారిలో వెండి ధరలు కూడా అదే దారిలో నడిచింది..మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి..
ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ లో ధరలను పరిసీలిస్తె..గురువారం బంగారం ధర కిందకు దిగి వచ్చింది..10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 430 వెలవెలబోయింది. దాంతో నేడు పసిడి రేటు రూ. 51,670కు తగ్గింది.. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. పసిడి రేటు రూ.400 తగ్గుదలతో రూ. 47,350కు క్షీణించింది. బంగారం ధరలు నేలచూపులు చూసాయి... ఇకపోతే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ.1500 పతనమైంది. దీంతో సిల్వర్ రేటు రూ. 71,900కు దిగి వచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో దాదాపు ఇదే ధరలు మార్కెట్ లో కొనసాగుతున్నాయి.
మన దేశం లో ధరలు ఇలా ఉండగా, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలకు రెక్కలు వచ్చాయి.. మార్కెట్ లో పసిడి ,వెండి ధరలు పరుగులు పెడుతున్నారు. విదేశీ మార్కెట్ లో ధరలను పరిసీలిస్తె..ఔన్స్‌కు 0.5 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1947 డాలర్లకు ఎగబాకింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా మండుతుంది. వెండి ధర ఔన్స్‌కు 0.73 శాతం పెరుగుదలతో 25.37 డాలర్లకు పెరిగింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా ఇండియాలో ధరలు తగ్గడం గమనార్హం.. ఇకపోతే బంగారం ధరల పై మార్కెట్ లో ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు ఉద్రిక్తతలు మొదలగునవి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..