బంగారం కొనాలనుకునే వారికి ఈరోజు మంచి రోజు అనే చెప్పాలి..ఈరోజు బంగారం ధరలలొ ఎటువంటి మార్పులు లేవు..నిన్న మార్కెట్ లో నమోదు అయిన ధరలు ఈరోజు కూడా మార్కెట్ లో నమోదు అవుతూన్నాయి.. ఇది మహిళలకు  కళ్ళు చెదిరె న్యూస్ అని చెప్పాలి. ఈ నెలలో బంగారం , వెండి ధరలు నిలకడగానే లేవు. నిన్న కాస్త ఊరట కలిగించిన వెండి ధరలు నేడు మార్కెట్ లో కూడా అదే దారిలో ఉన్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు  భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.మొత్తానికి కొనాలని అనుకొనేవారికి  ఈరోజు మంచి రోజు అనే చెప్పాలి.


మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము..ఈరోజు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,550 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,060 గా ఉంది.కిలో గ్రాము వెండి ధర రూ. 74,200 గా ఉంది. .10 గ్రాముల బంగారం ధర రూ. 54 వేల మార్క్ ను క్రాస్ చేసింది. అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 74 వేల మార్క్ ను దాటేసింది. బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు నమోదు అవుతూన్నాయని తెలుస్తుంది.బంగారం ధరలు స్థిరంగా వుంటే .. వెండి ధరలు కూడా అదే దారిలో నడుస్తూన్నాయి..  


ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిసిలిస్తె..ఢిల్లీలో వెండి  రూ.69,100 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.69,100 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.74,200 ఉంది. బెంగళూరులో రూ.69,100, కేరళలో రూ.74,200 లు నమోదు అవుతున్నాయి.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200, విజయవాడలో రూ.74,200, విశాఖపట్నంలో రూ.74,200 లుగా కొనసాగుతోంది.. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన మన దేశంలో స్థిరంగా ఉండటం గమనార్హం..బంగారం పై ఎన్నో అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి.. అందుకే ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: