పసిడి ప్రియులకు ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు ఝలక్ ఇస్తున్నాయి.నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి.బంగారం ధరలు కాస్త పెరిగితే వెండి మాత్రం మూడు రోజులుగా కిందకు దిగి వస్తుంది..ఈరోజు కూడా మార్కెట్ లో వెండి ధరలు భారీగా కిందకు వచ్చాయి. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు 22 క్యారెట్లకు 250 రూపాయలు పెరుగగా, 24 క్యారెట్లకు 250 రూపాయలు పెరిగిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇకపోతే ఈరోజు కిలో వెండి ధర స్థిరంగా ఉంది.అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయని నిపుణులు అంటున్నారు..


ఇకపోతే దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,310 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,310 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,960 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,430 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 వద్ద కొనసాగుతోంది.



అదే విధంగా కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 వద్ద ఉంది.



పసిడి ధరలు పరుగెడుతుంటే.. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది.హైదరాబాద్‌లో ధర రూ.68,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, చెన్నైలో రూ.68,000 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.62,200 వద్ద ఉంది. వెండి వస్తవులు కొనాలని భావించె వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.వెండి వస్తువులకు కూడా మార్కెట్ లో డిమాండ్ భారీగా పెరిగింది.. దేశీయ కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: