శుభకార్యం ఏదైనా సరే కచ్చితంగా మగువలు బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో సందర్భం తో పని లేకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోని బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కలిగే మార్పుల వల్ల బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,000 దాటేసింది. కొద్ది రోజుల క్రితం ఏకంగా రూ .80,000 మార్కును కూడా టచ్ చేసింది. ఒకానొక సమయంలో రూ.1లక్ష వరకు చేరుకుంటుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.


కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బంగారం ధరలు దిగివచ్చాయని తెలుస్తోంది. దేశంలోని అన్ని దాదాపు ప్రధాన నగరాలలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  విజయవాడ లో  మంగళవారం రోజున 22 క్యారెట్లలో 10 గ్రాముల బంగారం ధర రూ .66,740 ఉండగా ఇప్పుడు అది తగ్గుముఖం పట్టి ఈరోజు అనగా బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,590కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,640కు చేరుకున్నది. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.


ఢిల్లీ.. దేశ రాజధాని ఢిల్లీలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740,  ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,790 కి చేరుకుంది.


ముంబై.. అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే ముంబైలో లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.72,640కి చేరుకుంది..

ఇక మిగిలిన ప్రధాన ప్రాంతాలలో కూడా ఇదే ధరలు కొనసాగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: