![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/gold/124/gold-demand-dicresse5c2fff9-16bd-4606-82c6-c34ddcc10e8c-415x250.jpg)
తక్కువ అవుతున్నప్పుడు మళ్లీ పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతోనే చాలామంది కొంటూ ఉంటారు. ఇంకా పెరిగిపోతుంది అనుకుంటే కొంటూ ఉంటారు.. అందుకే వ్యాపారుల సైతం ఆడుతున్న గేమ్ ఏమిటంటే లక్ష రూపాయల వరకు తులం వెళుతుందనే విధంగా తెలుపుతూ ఉంటారు. దీంతో చాలా మంది ఎక్కువగా కొనేస్తారని ఈ ట్రిక్కులు ఉపయోగిస్తూ ఉంటారట. దీంతో కొంతమేరకు కొంతమంది కొన్నప్పటికీ కూడా..కానీ మధ్యతరగతి ప్రజలు మాత్రం అవసరమైతేనే ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు.. లేకపోతే ఏ విధంగా కొనడానికి కూడా మక్కువ చూపడం లేదట. దీంతో రాబోయే రోజుల్లో కచ్చితంగా బంగారం కొనే వారు కూడా తగ్గిపోతారు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూ ఉండడంతో సామాన్యులు కూడా కొనలేని స్థితికి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం తులం బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ .86 వేల వరకు ఉన్నదట. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,310 ఉన్నది. వెండి విషయానికి వస్తే ప్రస్తుతం కిలో వెండి రూ.99,400 వరకు ఉన్నదట. అయితే బంగారం తగ్గే అవకాశం ఉంటుందా అంటూ మార్కెట్ నిపుణులు ఉంటుందా అంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదంటూ తెలుపుతున్నారట.