![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/gold/124/gold-price-incrose-seal-damal7737e677-f195-4f9d-8053-297df2133873-415x250.jpg)
గత ఏడాదితో పోలిస్తే నగల అమ్మకాలు ప్రస్తుతం 70 నుంచి 80 శాతం వరకు పడిపోయాయని వ్యాపారస్తులు సైతం వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలను చూసి ప్రజలు కూడా తమ నిర్ణయాలను మార్చుకుంటున్నారని.. బంగారం ధరలు అధికంగా ఉండడం చేత పసిడి విక్రయాలు గణనీయంగా పడిపోతున్నాయని వ్యాపారస్తులు సైతం లబోదిబోమంటున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు అయిన డోనాల్డ్ ట్రంప్ కూడా మెక్సికో, కెనడా UE వంటి మిత్ర దేశాలతో పాటుగా చైనా వంటి వాటిపైన సుంకాలు పెంచేశారట. దీంతో పెట్టుబడులకు డోకాలు అయినటువంటి ఈ బంగారం ధర చుక్కలంటుతోందట.
అలాగే రూపాయి పతనం కూడా పసిడి ధరలు పెరగడానికి ముఖ్య కారణం అవుతున్నది. అంతేకాకుండా మనం డాలర్ల చెల్లించాల్సి ఉంటుంది డాలర్ తో రూపాయి రేటు రోజురోజుకి క్షీణిస్తూనే ఉన్నది. దీంతో గత నాలుగు నెలలలోనే RBI 9000 కోట్ల డాలర్లను ఖర్చు చేసిందట. ఒకవేళ ఇలాగే కొనసాగితే మార్చి కల్లా రూపాయి రేటు 90 కి దిగజారిపోయే ప్రమాదం ఉందంటూ దేశీయ మార్కెట్లో హెచ్చరిస్తున్నారు. బంగారం పెరగడానికి ఏమో కూడా ముఖ్య కారణం ఇదే అంటూ తెలుపుతున్నారు.
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయలు పెరిగి..88,100 రూపాయల వరకు చేరిందట. బంగారం ధర ఈ ఏడాది 10 శాతానికి పైగా పెరిగిందని 2024 లో పసిడి ధర 21 శాతం పైగా పెరిగిందని తెలుపుతున్నారు నిపుణులు . ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి మరింత ధరలు పెరుగుతున్నాయి. పసిడి ఉత్పత్తి తక్కువ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది.