పిత్తాశయాన్నే గాల్ బ్లాడర్ అంటారు. పిత్తాశయంలో రాళ్ళు రావడం తరుచుగా చూస్తుంటాం. ఇది కొంచెం భయపడవలసిన ఆరోగ్య స్థితే. మిగతా వాటితో పోలిస్తే, ఈ సమస్యతో బాధ పడుతు నప్పుడు కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఆహార నియమాలు పాటించవలసిందే. లేదంటే సమస్య తీవ్రం అవ్వొచ్చు దీనికి చికిత్స తీసుకుంటున్నప్పటికిని. కొన్ని ఆహారాలు ఈ సమస్యను తేలిక పరుస్తాయి కూడా. అవేమిటో పరిశిలిద్దాం.
1. పిత్తాశయం రాళ్ళు: ఇది చిన్న సంచి లాంటి నిర్మాణంతో కాలెయానికి కింది వైపు ఉంటుంది. కాలేయం ఉత్పత్తి చెసే పైత్యరసాన్ని (బైల్-జూస్) ఇది నిలువ చేస్తుంది. సహజంగా దీనికి ఎటువంటి సమస్యలు రావు, కాని దీని ప్రయాణ మార్గంలో ఆటంకాలు ఏర్పడి, తత్ఫలితింగా పిట్టాశయం లో "రాళ్ళు" ఏర్పడే అవకాశం ఉంది. అధిక బరువు, జన్యువులు వల్లనే కాకుండా, ఆహారపు అలవాట్ల ద్వారా కూడా ఈ రాళ్ళు తయారవవచ్చు.
2. పిత్తాశయం రాళ్ళు తెలుసుకోవడం: పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడితే తేలిక పాటి నొప్పి పొత్తి కడుపులో మొదలై తరుచుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే ఈ నొప్పి కూడా చాల చురుగ్గా ఉంటూ, తరుచుగా కొనసాగుతుంది. వాంతి వచ్చిన అనుభూతి కూడా కలుగుతుంది. కొన్ని సార్లు జ్వరం, తలనొప్పి తదితర ఆరోగ్యసమస్యలు కూడా రావొచ్చు.
3. ఈ జబ్బు ఉన్నవారు దూరంగా ఉంచాల్సిన ఆహారం: ఈ పిత్తాశయరాళ్ళు సమస్య ఉన్నవారు "అధిక కొవ్వు" గల అన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా, నూనెలో వేయించిన ఆహార పదార్ధాలు (ఫ్రైడ్ ఫుడ్స్), మాంసా హరాలు, పాల ఉత్పత్తులు (డైరీ ప్రొడక్ట్స్) లకు దూరంగా ఉండడం లేదా తక్కువ తగినంత మోతాదులో తీసుకోవాలి. "ఎసిడిటీ మరియు గ్యాస్" కలగ జేసే అధిక "మసాలా ఆహార పదార్ధాలకు (స్పైసి-ఫుడ్స్) కూడా దూరంగా ఉండాలి. కూరగాయలల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్, మరియు ఆల్కహాలుకు కూడా దూరంగా ఉండాలి.
4. ఈ జబ్బు ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారాలు: ఇక తీసుకోవాల్సిన ఆహారాల విషయానికి వొస్తే, ముఖ్యంగా తాజా పండ్లు, తాజా కూరగాయలు తినవచ్చు. సేంద్రియ ఏరువులతో పండించిన కూరగాయలు మరీ మంచివి. అవకాడోస్, బీట్-రూట్, బెండకాయలు, కందగడ్డలు, ఉల్లిపాయలు అహారం లో తీసుకోవచ్చు. చేపలు మరియు ఇతర జలం లో పెరిగే జంతువుల మాంసం తినవచ్చు. ఆపిల్స్, బొప్పాయి మొదలైన పండ్లు ఈ పిత్తాశయ సమస్యను తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి.