
మునగ విశేషమైన పోషకాలున్నచెట్టుగా ప్రసిద్ధి.
5000 సంవత్సరాల క్రితమే ఇది వాడుకలో వున్నట్లు తెలుస్తోంది. మునగకాయలే కాకుండా ఆకులు
కూడా చాలా బలమై న ఆహారం. బాక్టీరియా, శిలీంధ్ర కీటక సంహారిగా ఎరువుగా దీన్ని ఉపయోగిస్తారు. వేర్లు, ఆకులు, కాయలు, విత్తనాలు వైద్యంలో వుపయోగిస్తున్నారు. ఇటీవల
జరిగిన ప్రయోగాల, పరిశోధనల ఫలితంగా తక్కువ వ్యయంతో మునగ విత్తనాలతో నీటిలోని బ్యాక్టీరియాను నిర్మూలించి, నీటిని శుద్ధి చేయొచ్చు.
నిత్యం మనం మునగ ఆకు, పువ్వును చూస్తూనే ఉంటాం కాని వాటిని ఆహారం, ఔషధంగా తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపించకుండా వదిలేస్తుంటాం. కాని వాటి లో ఎలాంటి జౌషద గుణాలు ఉంటాయి. ఆహారంగా తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయనేది చాలా మందికి తెలియని విషయం. మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుత మైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైందని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలుపు తున్నారు.
నాలుగు, ఐదు వేల యేళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును ఔషధం తయారీలో వినియోగిస్తురు అంటేనే ఆ ఆకు గొప్పతనం అర్థమవుతోంది. తరచూ ఇళ్లలో మునగ కాయలను తినే వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ మునగ ఆకు, పువ్వులలో ఉన్న పోషకాలను తెలుసుకుంటే తినే ఆహారంలో భాగంగా మునగాకు తప్పకుండా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయంచేయడానికి ఈ మునగ ఆకును ఉపయోగిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయమైన ఔషధంగా చెబుతుంటారు పెద్దలు.
మునగాకులో ఉన్న అద్భుతమైన ఔషధగుణాలు:
* మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సంవృద్ధిగా ఉంటాయి.
* క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్-ఎ నిపదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా
పొందవచ్చు.
* కళ్ల వ్యాధులకు సంబంధించిన ఔషధంలో మునగాకునువాడతారు.
* పాల నుంచి లభించే కాల్షియం 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.
* పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.
* అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి
పొందవచ్చు.
* మహిళలు రోజుకు 7గ్రాముల మునగాకు పొడిని 3నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే
13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలిందని ఆయుర్వేద వైద్య
నిపుణులు తెలుపుతున్నారు.
* ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషధం మునగాకు. ఊపిరితిత్తులు, కాలేయం, మహిళల్లో
అండాశయంలో వచ్చే (ఒవేరియన్), నల్ల మచ్చల వద్ద వచ్చే (మెలానోమా) క్యాన్సర్లను
నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో తేలిందని వైద్యులు తెలుపుతున్నారు.
* యాంటీ ట్యూమర్ గానూ మునగాకు వ్యవహరిస్తుంది.
* థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే ప్రకృతి సిద్ధమైన ఔషధంమునగాకు.
* మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ షుగర్‌లో షుగర్ లెవల్స్‌ని
కంట్రోల్ చేస్తుందట.
* అద్భుతమైన ఔషద సంజీవని మునగాకు.
* మునగాకులో ఎ,సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
* మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు.
* అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరస్లు కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి.పోషక
మునగాకులో నిబిడి ఉండే విలువైన పదార్థాలు:
నీరు - 75.9 శాతం, పిండి పదార్థాలు-13.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు-17
గ్రాములు, మాంసకృత్తులు-6.7 గ్రాము లు, కాల్షియం-440 మిల్లీ గ్రాములు, పాస్పరస్-70
మిల్లీ గ్రాములు, ఐరన్-7 మిల్లీ గ్రాములు, సి విటమిన్-200మిల్లీ గ్రాములు, ఖనిజ
లవణాలు-2.3శాతం, పీచు పదార్థాలు-0.9 మిల్లీ గ్రాములు, ఎనర్జీ-97 కేలరీలు.
మునగాకులో అద్భుత ఔషధ విలువలు:
* ప్రారంభ దశలో ఉన్న కీళ్ల నొప్పులకు మునగాకు దివ్య ఔషధం.
* మునగాకు నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మ రోగాలు నివారణ అవుతాయి.
* మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యం,రేచీకటి తొలగిపోతాయి.
* మునగ ఆకులో అమినో ఆమ్లాలు ప్రోటీన్ల లోపంవల్ల వల్లవచ్చే ఆరోగ్యసమస్యలను తగ్గిస్థాయి.
* గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతోసమానం.
* మునగ దోస లను కలిపి సేవిస్తే గుండె, కాలేయం, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు క్రమంగా
తొలగిపోతాయి.
* మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.
మునగాకుతో మరిన్ని ఉపయోగాలు:
* మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారిఎముకలు బలంగా
తయారవుతాయి. *గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం, ఐరన్ విటమిన్లు
పుష్కలంగా లభిస్తాయి. *తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
* పాలిచ్చే తల్లులకు మునగాకు కూర వండి పెడితే పాలు పెరుగుతాయి.
* గుప్పెడు మునగాకులను వంద మి.లీ. నీటిలో 5 నిమిషాలు కాచి
చల్లార్చి, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే
అస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.
* మునగాకు రసం ఒక స్పూన్ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్లలో కలిపి కొంచెం
తేనె కలిపి ఇస్తే విరేచనాలు తగ్గుతాయి.
* మునగ నిమ్మరసాలను కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్-హెడ్స్ పోతాయి.
ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు అమృతవర్షిని వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతోంది. ఇన్ని అద్భుత గుణాలు ఉన్న మునగాకును నిర్లక్ష్యం చేయకుండా వాడి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని వైద్యులు తెలుపు తున్నారు.