ఇవి నీరసపడిన మనిషికి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. వీటిలో కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ గురించి ముందే తెలుసు. సమ్మర్ లో మాత్రమే దొరికే "కూలింగ్ ప్రూట్స్" లో "తాటిముంజలు లేదా ఐస్ ఆపిల్స్ " కూడా ఒకటి. వేసవి తాపాన్ని హరించి అతి రుచికరమైన తక్షణ శక్తినిచ్చే ఆహారం. తాటి ముంజల్లో వుండే కొబ్బరినీళ్ళ లాంటి తియ్యటినీళ్ళు మీదపడ కుండా తినటం ఒక సరదా! వేసవిలో ప్రత్యేకంగా లభించే తాటిముంజలు, పుచ్చకాయలు ప్రజలు బానుడి తాపన్ని తట్టుకునేందుకు అత్యంత ప్రియంగా విటిని తింటారు. అదేవిధంగా శీతాల పానియాలపై కూడా ఎక్కువ మోజు చూపుతారు.అందులో భాగంగానే వేసవి కాలంలో వచ్చే తాటిముంజలకు బలే గిరాకి పెరిగింది.
వేసవిలో విరివిగా లభించే వీటివల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు, అందానికి ఎంతో మేలుచేస్తాయివి. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని "ఐస్ ఆపిల్" అంటారు. తాజాగా ఉండే ఈ తాటిముంజ 'జ్యూసీ లిచీ ఫ్రూట్' లా ఉంటుంది మరియు రుచి తాజా లేలేత కొబ్బరి బోండాం టేస్ట్ కలిగి ఉంటుంది.
కాలిన గాయాలకు,మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించేందుకు తాటిముంజల్నీ తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వీటితో పాటు మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు ఈ క్రింది విధంగా కాలిన గాయాలకు,మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించేందుకు తాటిముంజల్నీ తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వీటితో పాటు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా
ఎండాకాలంలో తాటిముంజలు లభిస్తాయి. వీటిని ఈ కాలంలో తినడంవల్ల ఎన్నో లాభాలున్నాయి. శరీరాన్ని చల్లబరిచేగుణం ముంజల్లో ఎక్కువగా ఉంటుంది. ముంజ ల్లో విటమిన్ ఎ, బి, సి,ఐరన్ జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి అనేక ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని అనవసర పదార్థాలను బయటికి పంపుతాయి. ఈ కారణంగా శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. వీటిని తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. వీటిలోని నీటిశాతం పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
వేసవి కాలంలో ప్రిక్లీ-హీట్ ను తగ్గిస్తుంది మరియు చెమటకాయలను నివారిస్తుంది. తాటి ముంజల పొట్టును తీసి చర్మానికి మర్ధన చేయడం వల్ల, చెమటకాయలు తగ్గించడంతో పాటు, చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. ముంజల్లో ఉండే ఫైటో కెమికల్స్, ఆంతోసినిన్ శరీరంలో ట్యూమర్స్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా నిరోధిస్తుంది.