పాము అంటే ఎవరికైనా చాల భయము. పాము కాటేసిందనే మాట వినగానే ప్రాణాపాయం తప్పదనే భావనకు వచ్చేవారి సంఖ్య తక్కువ సంఖ్యలో అసలు లేదు. పాముల పట్ల వుండే అపోహలు, భయాలే దీనికి ప్రధాన కారణం. చాలా మంది అనుకున్నట్లు నూటికి 60 శాతం పాములు విష సర్పాలు కావు. మిగిలిన 40 శాతంలోనూ ప్రమాదం కలిగించేవి కేవలం 20 శాతం మాత్రమే. అవగాహనా లోపంతో విషసర్పం కాటుకు గురైనా సొంత వైద్యంతో సరిపెట్టి ప్రాణాల మీదికి తెచ్చుకునే వారు కొందరైతే, అసలు విషం లేని పాము కరిచినా కేవలం భయంతో చనిపోతున్న వారు మరికొందరు. 


ప్రస్తుత ప్రపంచంలోనూ ఇలాంటి పరిస్థితి నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికీ మనదేశంలో పాముకాటుతో చనిపోతున్న వారి సంఖ్య 60 వేలకు పైగా ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది.  అయితే వీలున్నంత వేగంగా ప్రథమ చికిత్స చేసి వైద్య చికిత్స అందించగలిగితే ఈ మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తీసుకొని రావచ్చు.  కరచినది ఏ పామో తెలిస్తే చికిత్స మరింత సులభమవుతుంది. ఎందుకంటే కాటేసిన పామును బట్టి వాటి లక్షణాలు మారతాయి.


పాము కరిస్తే ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మరి..మొట్ట  మొదటగా బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. భయాందోళనలకు, కలవరపాటుకు గురికాకుండా పొరుగువారు ధైర్యం చెప్పాలి. తీవ్రమైన ఒత్తిడి చర్యల వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది. బాధితుడిని అసలు నడిపించవద్దు.


 ఆటో, బైక్, అంబులెన్స్ ను ఆశ్రయించటం మంచిది. పాము కరిచిన చోట తువ్వాలు, తాడు వంటి వాటితో గట్టిగా కట్టుకడితే రక్తం ఇతర భాగాలకు చేరటం ఆలస్యమవుతుంది. ప్రమాద తీవ్రత మరింత తగ్గుతుంది. పాముకాటుకు గురైన వ్యక్తికి తినేందుకు లేదా తాగేందుకు ఏమీ ఇవ్వకూడదు. సొంత వైద్యం అసలే పనికిరాదు. బాధితుడిని నిశ్శబ్దంగా ఉంచండి. అవకాశం ఉంటే ఏ పాము గుర్తించేందుకు ప్రయత్నించాలి. కరచిన చోట చాకుతో కోయటం వంటివి చేయకూడదు. నాటు వైద్యం, మంత్రతంత్రాల పేరిట సమయం వృధా చేయక తొందరగా ఆసుపత్రికి తీసుకొని పోవడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: