ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది పనుల హడావిడి వలన, వివిధ కారణాల వలన బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా కొందరు ఏకంగా మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. పరిశోధకులు ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవటం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా ఫ్రూట్స్, ఉడకబెట్టిన కూరగాయలు, ఆమ్లెట్, ఇడ్లీ, వడ, దోశ... ఇలా చాలా రకాలైన వంటకాలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. పరిశోధకులు బ్రేక్ ఫాస్ట్ చేయకపోవటం వలన గుండె సంబంధిత సమస్యలు ఏర్పడుతాయని చెబుతున్నారు. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఖచ్చితంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
సరిగ్గా ఆహారం తీసుకోని వారు త్వరగా మరణించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పండ్లు, బ్రెడ్, చపాతీ, పాలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో బ్రేక్ ఫాస్ట్ చేయని వారిలో జీవక్రియ దెబ్బ తింటుందని తేలింది. బ్రేక్ ఫాస్ట్ చేయనివారిలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయని హైపర్ టెన్షన్ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ ను పట్టించుకోని వారు టైప్ 2 డయాబెటిస్ కు గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.