శీతాకాలంలో చుండ్రు అనేది సాధారణంగా కనిపించే సమస్య. టీనేజర్స్ ను ఎక్కువగా ఈ సమస్య వేధిస్తుంది. చుండ్రు తెల్లని పొడి రూపంలో శరీరంపై రాలుతుంటుంది. మార్కెట్లలో దొరికే ఉత్పత్తులతో చుండ్రును పూర్తిగా నివారించడం చాలా కష్టం. ఒత్తిడి, కాలుష్యం, దూర ప్రయాణాల కారణంగా ప్రతి ఒక్కరినీ చుండ్రు సమస్య వేధిస్తుంది. సహజంగా, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చుండ్రును కొన్ని చిట్కాలను పాటించి నివారించవచ్చు. 
 
చండ్రు సమస్య ఉన్నవారు ఆలివ్ ఆయిల్ తో వారంలో రెండు రోజులు తలకు మసాజ్ చేయాలి. సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలు ఆలివ్ ఆయిల్ లో ఉన్నాయి. తమలపాకులను మెత్తగా రుబ్బించి తలకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. నిమ్మరసంతో రాత్రి పడుకునే ముందు జుట్టుకు మర్దన చేసి లేచిన తరువాత జుట్టును చల్లని నీళ్లతో కడిగితే కూడా చుండ్రు తొలగిపోతుంది. 
 
రాత్రంతా నీళ్లలో నానబెట్టిన మెంతులను తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి 30 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చుండ్రు దూరమవుతుంది. కొబ్బరినూనెతో కర్పూరాన్ని కలిపి రాత్రి పడుకునే ముందు తలకు మర్దన చేసి వెచ్చనినీటితో కడిగితే చుండ్రును నివారించవచ్చు. వెనిగర్ ను నీటిలో కలిపి రాత్రి పడుకునే సమయంలో తలకు రాసుకొని ఉదయం కడిగితే చుండ్రు సమస్య దూరమవుతుంది. 
 
వంటసోడాకు కొన్ని చుక్కల నీటిని కలిపి మసాజ్ చేసి నీటితో కడిగితే చుండ్రు తొలగిపోతుంది. పులిసిన పెరుగును తలకు పట్టించి కడిగేసుకోవడం ద్వారా కూడా చుండ్రు సమస్య దూరమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: