ద్రాక్ష పండ్లు తినటం వలన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ద్రాక్ష పండ్లలో ఉండే పోషక పదార్థాల వలన శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ద్రాక్ష పండ్లు తినేవారిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. ద్రాక్ష పండ్లు తినటం వలన రక్తప్రసరణ మెరుగుపడటంతో పాటు మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధ పడేవారికి ద్రాక్ష పండ్లు తింటే ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ద్రాక్ష పండ్లలో ఉండే ఖనిజాలు మరియు విటమిన్లు ఆరోగ్యానికి పూర్తి రక్షణనిస్తాయి. ద్రాక్ష పండ్లు ఎండిన తరువాత కిస్మిస్ గా మారినా అందులో పోషకాలు అలాగే ఉంటాయి. కొలెస్ట్రాల్ ను అదుపు చేయటంలోను, క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో ద్రాక్షలో ఉండే పోషక పదార్థాలు సహకరిస్తాయి. కొవ్వు పదార్థాలు, సోడియం ద్రాక్షలో చాలా తక్కువగా ఉంటాయి. ద్రాక్షలో ఏ విటమిన్, సి విటమిన్ ఎక్కువగా ఉంటాయి.
ద్రాక్ష ఆస్తమా సమస్యతో బాధ పడేవారికి ఆయాసం తగ్గించటంతో పాటు ఊపిరితిత్తులకు బలాన్ని పెంచుతుంది. ద్రాక్ష నొప్పి వలన, దడ వలన గుండె మీద పడే ప్రభావాన్ని తగ్గిస్తుంది. మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు ద్రాక్ష తింటే ఆ సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ద్రాక్ష కాలేయాన్ని ఉత్తేజపరచటంతో పాటు పైత్య రసమును సరిగ్గా తయారు చేయటంలో ఉపకరిస్తుంది. ద్రాక్ష రసాన్ని అలవాటు చేసుకుంటే ఆల్కహాల్ మీద ఆసక్తి తగ్గుతుంది.