ఉదయం లేవగానే ప్రతి మనిషి పరిగెడుతూనే ఉంటాడు. అలాంటి మనుషులు కాలం మారుతున్న కొద్దీ , టెక్నలాజి పెరిగిన కొద్దీ ఆహారపు అలవాట్లు కూడా పూర్తి గా మారిపోవడం పక్కన పెడితే మనుషులు మనుషుల్లా గా ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. మిషన్ లు పెరిగిన కొద్దీ మనుషుల బద్ధకం కూడా పెరిగిందనే చెప్పాలి అందుకే శరీరాలు కూడా మాట వినకుండా వస్తున్నాయి. 

 

ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనం మనల్ని ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలన్నది చూడాలని నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళ అవుతాయమాని వైద్యులు చెబుతున్నారు. బద్ధకం ముందు మనం తలా ఒంచకూడదని వారు అంటున్నారు. ఆరోగ్యం కన్నా మనకు మరొకటి లేదు. 

 

ఉదయం లేవగా నే శరీరానికి కొన్ని రకాల కదలికలు చేస్తేనే మనిషి ఆరోగ్యాం గా ఉంటారు అని అంటున్నారు. కనీసం రోజు లో ఒక్క 30 నిమిషాలై నా కూడా ఇలా చేయడం వల్ల ఊబకాయం స్థూలకాయం దరిచేరవట. రోజు లో ఎలా కాదనుకున్న కూడా 45 నిమిషాలు 3కిలోమీటర్లు నడవటం ఆరోగ్యాని కి ఎంతో మేలట సూర్య నమస్కారాలు, చిన్న పాటి వ్యాయామాలు చేయడం తో అధిక కొవ్వు పేరుకుపోకుండా ఉంటుందట. 

 

మరో విషయమేంటంటే.. రోజుకు 3 నిమిషాలు వ్యాయామాలు చేయడం వల్ల  శరీరానికి చాలా ఉపయోగాలున్నాయట. శరీరంలోని చేదు కొవ్వు కార్బన్ డైయాక్సిడ్ ద్వారా బయటకు పోతుంది. అందుకోసం గాని రోజులో  కనీసం 3 నిమిషాలు ధ్యానం చేయాలనీ నిపుణులు అంటున్నారు. మనం అర్ధగంట చేసే పనులు కన్నా మూడు నిమిషాలు చేస్తే రోజులో కలిగే ఎన్నో ఒత్తిడులు దూరమవుతాయట ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా రోజులో మూడు నిమిషాలు ధ్యానం చేయడం రోజూవారిలో అలవాటు చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: