గుడ్డు తినేవారికి గుడ్డు విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. కొందరు గుడ్డు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబితే మరికొందరు మాత్రం గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా కీడు చేస్తుందని చెబుతూ ఉంటారు. పెద్దలు రోజుకు ఒక గుడ్డు తిని గ్లాసు పాలు తాగితే పెరుగుదల బాగుంటుందని చెబితే కొందరు మాత్రం గుడ్డులో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని గుడ్లు తింటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ ఉంటారు. మరి గుడ్డు విషయంలో ఏది నిజం..? ఏది అబద్ధం...? అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. 
 
కానీ వైద్య శాస్త్రం మాత్రం గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనల ప్రకారం గుడ్డులో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ అది మంచి చేసే కొలెస్ట్రాల్ తప్ప చెడు కొలెస్ట్రాల్ కాదు. గుడ్డు తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. గుడ్డు తింటే శరీరానికి ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉడకబెట్టిన గుడ్లు నూనెలో వేసిన గుడ్ల కంటే ఆరోగ్యానికి ఎంతో మంచివి. 
 
కంటి ఆరోగ్యానికి, కండరాల బలం పెరగడానికి, బరువు తగ్గడానికి గుడ్డు తినడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. కెనడాకు చెందిన మెక్ మాస్టర్ యూనివర్సీటీ పరిశోధకులు కూడా 1,77,000 మందిపై అధ్యయనం చేసి కోడిగుడ్డుకు, గుండెజబ్బులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రతిరోజు ఒక కోడిగుడ్డును తినడం వలన శరీరానికి మేలు జరుగుతుందే తప్ప ఏ మాత్రం హాని జరగదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: