ఏదైనా సరే ఉచితంగా వస్తే దాని విలువ తెలియదు. ఇప్పుడు ప్రజలకు ఎండ కూడా అంతే అయ్యింది. రోజూ ఎండలో కూర్చుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. డీ విటమిన్ లభిస్తుంది. రోజూ కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల మనసు ఆహ్లాదంగా మారుతుంది.

 

 

శరీరానికి అవసరమైన శక్తీ అందుతుంది. సూర్యరశ్మి మెదడులోని సెరటోనిన్‌ స్థాయుల్ని పెంచుతుది. అయినా మనం దీన్ని పట్టించుకోం. ఎండజోలికే వెళ్లం.. చలికాలంలో ఎండలో తక్కువగా గడిపేవారిలో మానసిక ఆందోళన లక్షణాలు కనిపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

 

నలుగురిలో కలవలేకపోవడం, అతిగా తినేయడం, అలసట వంటి లక్షణాలు మొదలవుతాయి. సీజనల్‌ డిప్రెషన్‌గా పరిగణించే ఈ సమస్యను అధిగమించాలంటే ఎండలో కూర్చోవడమే సరైన పరిష్కారం. కానీ మనం ఫ్రీ గా వచ్చే ఎండని వాడుకోకుండా.. రోగాలు తెచ్చుకుని.. వందలు , వేలు మందులకు తగలేస్తుంటాం.

 

 

ఇంటిపనులు, ఆఫీసులో విధులు, ఇతర సమస్యలతో విపరీతంగా ఒత్తిడికి లోనయ్యేవారు కూడా రోజూ కనీసం పావుగంట ఎండలో గడిపేలా చూసుకుంటే మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: