కొన్ని సీజన్స్ లలో మాత్రమే కొన్ని రకాల పండ్లు దొరుకుతాయి. అరటి పండ్లు మాత్రం ఆ సీజన్ ఈ సీజన్ అని తేడా లేకుండా అన్ని సీజన్స్ లో అందుబాటులో ఉంటాయి. అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండటంతో శరీరానికి కావాల్సిన ఎనర్జీ అందుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.
అరటి పండ్లు జీర్ణక్రియను పెంచడంతో పాటు మనలోకి కోపాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండ్లు కంటిచూపును మెరుగుపరచడంతో పాటు లివర్ ను శుభ్రం చేస్తాయి. అరటి పండ్లు కిడ్నీ సంబంధిత రోగాలను దరి చేరనీయవు. ఆసిడిటీ సమస్యలను త్వరగా తగ్గించడంతో పాటు శరీరంలో ఐరన్, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. మచ్చలున్న అరటి పండ్లలో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి సందేహాలు లేకుండా అరటి పండ్లు తినవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ పండ్ల వల్ల మేలు జరుగుతుందే తప్ప హాని జరగదు. అరటి పండ్లు జీర్ణ క్రియలను మెరుగుపరచడంతో పాటు గ్యాస్ ట్రబుల్స్ ను నివారిస్తాయి. ఈ పండ్లలో ఉండే కెమికల్స్ మూడ్ ను మార్చి సంతోషంగా ఉండేలా చేయగలవు. కండరాల నొప్పులను తగ్గించడంలో, రిలాక్స్ గా నిద్ర పోవడంలో ఈ పండ్లు సహాయపడతాయి.