కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఇండియాలోనూ ఈ కరోనా వైరస్ భయం ఎక్కువైంది. ఇప్పుడు ఈ వైరస్ ఇండియానూ వణికిస్తోంది. నిన్న మొన్నటి వరకూ మన దగ్గర కేసులు లేవు.. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది కదా..
ఇప్పుడు ఇండియాలోనూ దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వార్తలు వింటే గుండె గుబేలు మంటోంది. అయితే కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదంటోంది. కాకపోతే అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కరోనా వైరస్ పై వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది.
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో థర్మల్ స్కానర్లు పెట్టాలని ఆలోచిస్తోంది. నిరంతర వైద్య పర్యవేక్షణతో కరోనాను నివారించవచ్చని నిర్ణయానికి వచ్చింది. 0866 - 2410978 నంబర్ తో కాల్ సెంటర్ అందుబాటులోకి తెచ్చింది.
ఏ సందేహాలు ఉన్నా కాల్ చేసి తీర్చుకోవచ్చని వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్సి జవహర్ రెడ్డి తెలిపారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా భయం నేపథ్యంలో పుకార్లు కూడా ఎక్కువుతున్నాయి. అందుకే మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోండి.