ప్రస్తుత కాలంలో యువత వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడంతో బరువు పెరుగుతున్నారు. నిద్రలేమి, పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల బరువు పెరిగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బరువు తగ్గాలని అనుకునేవారు మొదట అన్నం మానేసి చపాతీ తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతామా...? ఆరోగ్యానికి చపాతీ, అన్నం ఏది మంచిది...? అనే ప్రశ్నలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. 
 
చపాతీ, అన్నం రెండింటిలో కారోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ప్రతిరోజూ తీసుకునే ఇతర వంటకాల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు కార్బో హైడ్రేట్స్ ను తగ్గించి ప్రోటీన్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారికి అన్నంతో పోలిస్తే చపాతీ మంచిది. ఎందుకంటే చపాతీలో తక్కువగా ఫైబర్, ప్రోటీన్, కొవ్వు ఉంటాయి. అన్నంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 
 
బరువు తగ్గాలనుకునేవారు చపాతీ తినటం మంచిదే కానీ రోజుకు నాలుగు కంటే ఎక్కువ చపాతీలను తినకూడదు. చపాతీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అరుగుదల నిదానంగా జరిగి ఎక్కువ సమయం ఆకలి వేయదు. చపాతీలో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సహాయపడుతుంది. అన్నంతో పోలిస్తే చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వైద్యులు రాత్రి సమయంలో చపాతీ తినాలకునేవారు 7.30 గంటల లోపు తింటే మంచిదని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: