ప్రస్తుత కాలంలో చాలామంది టిఫిన్, భోజనం స్టీల్ ప్లేట్లలో, ప్లాస్టిక్ ప్లేట్లలో చేస్తున్నారు కానీ పూర్వ కాలంలో భోజనాలు అరిటాకుల్లోనే చేసేవారు. అరిటాకు వండిన ఆహార పదార్థాలకు మరింత రుచిని తీసుకొనిరావడంతో పాటు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అరిటాకులో భోజనం తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆయుర్వేదంలో అరిటాకులో భోజనం చేస్తే పేగుల్లోని సూక్ష్మ క్రిములు నాశనమవుతాయని పేర్కొన్నారు.
అరిటాకులో వేడి పదార్థాలను వడ్డిస్తే ఆకు మీద ఉండే పొర అన్నంలో కలిసి శరీరానికి మంచి విటమిన్లను, పోషకాలను అందజేస్తాయి. ఎవరైనా అరటాకులో విషం కలిపినా అరిటాకు వెంటనే నల్లగా మారుతుంది. కాబట్టి అందులో విషం ఉందని తెలిసిపోతుంది. అరటి ఆకులో భోజనం చేస్తే రేచీకటి, అల్సర్లు, ఇతర సమస్యలు దూరమవుతాయి. అరిటాకులో భోజనం కఫం, వాతం లాంటి సమస్యలు తగ్గటంతో పాటు బలం చేకూరుతుంది.
అరిటాకులో భోజనం తింటే గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. రోజూ అరిటాకులో భోజనం భోజనం తింటే జుట్టు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అరిటాకులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అరిటాకులో ఉండే క్లోరోఫిల్ అనే పదార్థం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతాయి.