మన దేశంలో తాంబూలంలో తమలపాకును ఎక్కువగా ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. తేమ గల వేడి ప్రదేశాలలో వీటిని ఎక్కువగా పెంచుతారు. తమలపాకు వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తమలపాకులో విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిల్వ చేసిన నూనెలలో తమలపాకు వేస్తే ఆ నూనె చెడిపోకుండా ఉంటుంది. 
 
ఊబకాయం సమస్యలతో ఇబ్బందులు పడేవారు రోజూ ఒక తమలపాకును మిరియాలతో కలిపి తీసుకుని చన్నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. తమలపాకు రసాన్ని ముక్కులో వేసుకుంటే తలనొప్పి వెంటనే తగ్గుముఖం పడుతుంది. చుండ్రు సమస్యతో బాధ పడే వారు తమలపాకులను మెత్తగా నూరి తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధ పడేవారికి తాంబూలం మంచిది కాదు. 
 
తమలపాకులను మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అమితంగా తింటే నష్టం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరలు తింటే జీర్ణ వ్యవస్థకు ఏ విధంగా మేలు చేకూరుతుందో తాంబూలం తింటే కూడా అదే విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. తమలపాకు యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడంతో పాటు ముసలితనపు మార్పులను కూడా కట్టడి చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: