
ప్రస్తుతం సమ్మర్ వచ్చేసింది. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మరో వైపు కరోనా నేపథ్యంలో ఎవ్వరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. లోపల ఉన్న వాళ్లకు ఎన్ని ఏసీలు ఉన్నా... కరెంటు కోతలు ఉంటే చాలు లోపల ఉక్కపోత తప్పడం లేదు. లోపల ఉండి ఉండి చిన్న పనిమీద బయటకు రావాలన్నా ఎండ తీవ్రత తట్టుకోలేని పరిస్థితి. ఇదిలా ఉంటే సమ్మర్లో చెమట ఎక్కువుగా బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల శరీరంలో ఉన్న నీరు త్వరగా తగ్గిపోయి డీ హైడ్రేషన్‌కు గురయ్యి త్వరగా అలసి పోతుంటారు.
ఇందుకోసం చాలా మంది నీరు ఎక్కువుగా తాగడం లేదా జ్యూస్‌లు, పల్చటి మజ్జిగ ఉప్పు కలుపుకుని తాగుతారు. అయితే సబ్జా గింజల పానీయం తాగితే కూడా ఎండ తీవ్రమ మనమీద ఉండదు. ఇది శరీరంలో నీటి శాతం క్రమబద్ధీకరిస్తుంది. మన శరీరానికి కావాల్సిన విటమిన్లను కూడా అందిస్తుంది. అలాగే పీచు పదార్థాలను ఇంకా అనేక పోషకాలను అందిస్తుంది. శరీరంలో ఉన్న మలినాలను బయటికి పంపించి రక్తాన్ని శుద్ది చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ పానీయం తయారు చేయాలంటే ముందుగా సబ్జా గింజలను నాన బెట్టి అందులో ఓ టీ స్పూన్ నిమ్మరసం, పంచదార కలిపి తాగాలి. అప్పుడు అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటీ జీర్ణకోశ సంబంధ సమస్యలు కూడా రావు. అలాగే రోజంతా ఈ గింజలను నీటిలో నానబెట్టి పడుకునే ముందు తాగితే అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ పానీయంలో పంచదార కలపకుండా తాగితే షుగర్ పేషెంట్స్ కి షుగర్ అదుపులో ఉంటుంది. ఇంకా ఇది యాంటి బయాటిక్ గా పనిచేసి అనేక రకాల ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది. గోరు వెచ్చని నీటిలో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే అన్ని రకాల శ్వాస కోశ వ్యాధులు తగ్గుతాయి.