ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సంచలనమే సృష్టిస్తుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. దీనితో ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యాయి అంటే ఎండలతో ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశంలో ప్రజలకు ఎండ తీవ్రత ఎలా ఉందో అర్థం అవ్వటం లేదు. దీనికారణం ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వడంతో ఎవరికీ ఎండల ప్రభావం తెలియటం లేదు అనే చెప్పుకోవచ్చు. అయితే గత వారం రోజులుగా రాష్ట్రాలలో ఎండలు భగభగ మండిపోతున్నాయి అనే చెప్పవచ్చు. ఇలా ఎండ తీవ్రత ఎంత ఉన్నా కానీ.. కరోనా వైరస్ పై పోరాటం కోసం నిత్యం వైద్య, పోలీస్, కార్మిక శాఖ అధికారులు శ్రమిస్తూనే ఉన్నారు అనే చెప్పాలి. ఇక ఎండలో ఎక్కువగా తిరిగే వారు.. ఎవరైనా సరే శరీరంలో నుంచి నీరు ఎక్కువ శాతం బయటకు రాకుండా చూసుకోవడం మంచిది అని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇలా అవ్వడంతో శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యి ఎండ దెబ్బ తగలడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటూ వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇక వేసవి సమయంలో ఎండ తీవ్రతకు ఎంతగా తిరిగిన శరీరంలో నుంచి నీటిని బయటకు పోకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు.. ఎండ దెబ్బ కదలకుండా జాగ్రత్తపడవచ్చు అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇలా ఎక్కువగా ఎండలో తిరిగేవారు పుచ్చకాయలను తినడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటూ వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పుచ్చకాయలు ఎక్కువ శాతం తినడం ద్వారా మన శరీరంలో నీరు శాతం ఎక్కువగా పెరగడంతోపాటు.. అనేక పోషకాలు కూడా పొందవచ్చు.
ముఖ్యంగా ఇది తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న శక్తి కోల్పోకుండా లభించే ఎలక్ట్రోలైట్, సుక్రోజ్, ఫ్రక్టోస్ గ్రిల్ లు లభిస్తాయి. ఇలా తీసుకోవడం ద్వారా ఎక్కువ శాతం నీరసం, అలసట లాంటివి దగ్గరికి రాకుండా పుచ్చకాయలు సహాయపడుతాయి అనే చెప్పవచ్చు. ఇంకా ఇవి తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమయ్యే నీరు పుష్కలంగా లభిస్తుంది.. దీనితో డిహైడ్రేషన్ కు గురి అవ్వకుండా సహాయపడుతుందని. ఇక ఎండలో ఎక్కువ శాతం తిరిగేవారు ఖచ్చితంగా ప్రతిరోజు పుచ్చకాయలు తీసుకోవడం శ్రేయస్కరం అని వైద్య నిపుణులు తెలియ చేస్తున్నారు. ఇంకా ఎందుకు ఆలస్యం పుచ్చకాయలు తిని.. డీహైడ్రేషన్ కు గురి అవకుండా జాగ్రత్త పడండి.