ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి ఆహారం పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.మనం ఏ ఆహారం తీసుకుంటున్నాము అది మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం గమనించుకోవాలి. ఉదయం లేవగానే జాగింగ్, వ్యాయామం చేస్తూ ఉంటాము. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే, కానీ ఏ ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు ఏర్పడతాయి. ఈ విషపదార్థాలను బయటకు పంపించడానికి ఈ చిట్కాలను పాటించండి..

 ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ప్రతి రోజు ఉదయం లేవగానే పరగడుపునే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు.

రోజా ఆహారంలో క్యారెట్లు, దోస కాయలు,దుంపలు, మొలకలు,పచ్చి ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఎందుకంటే వీటన్నింటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

 కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోకపోవడం మంచిది.నీళ్లు మాత్రం రోజుకి కనీసం రెండు లీటర్ల అయినా తాగాలి. తాగడం వల్ల శరీరంలోని రత్తాలు బయటికి పోతాయి. నీళ్లకు కొవ్వును కరిగించే గుణం ఉంది. ఎన్ని నీళ్లు తాగితే అంతా మంచే జరుగుతుంది.

 వ్యాయామం చేయడం వల్ల మానసిక ఉల్లాసం,ఆరోగ్యంగా ఉంటారు రోజులో కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి.ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, యవ్వనంగా కనిపిస్తారు.

తగినంత నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.బాగా నిద్ర పోవడం వల్ల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.అలాగే విషపదార్థాలను బయటకు పోవడానికి నిద్ర ఉపకరిస్తుంది.

 కాలు పాటించడమే కాకుండా కొన్ని నిత్యం ఈ ఆహారాలు తీసుకోవడం కూడా మంచిదే.నిమ్మ, ఆరెంజ్,పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.ఇవి శరీరాన్ని పాడు చేసే ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకుంటాయి.అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇంకా నిత్యం మనం తినే ఆహారంలో ఇవి కూడా చేసుకోవాలి.

గ్రీన్ టీ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల తీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

క్యాబేజీలో సల్ఫర్ ఫేస్ ఉంటుంది. దీనివల్ల శరీరంలోని బయటకు పోతాయి.చిన్న క్రియ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.అలాగే యాంటీ ఆక్సిడెంట్, గ్లూటాతియోన్ కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.

 ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు జీర్ణ వ్యవస్థలో క్లోరోఫిల్ స్థాయిని పెంచడమే కాకుండా,శరీరంలోని పదార్థాలను కూడా బయటకు పంపుతుంది.

 బీట్ రూట్ తీసుకోవడం వల్ల కాలేయంలోని యాంటీ యాక్సిడెంట్ ఎంజైముల ఉత్పత్తిని పెంచుతాయి.ఇంకా పిత్తాశయంలోని అదనపు పిత్తాన్ని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: