రోజూ మనం ఏం తింటాం.. ఇంకేం తింటాం.. అన్నం.. కూరలు.. ఇంకా చెప్పాలంటే.. మరికొన్ని పండ్లు.. ధాన్యాలు.. ఎట్సెట్రా.. అంతేనా.. అవును.. ఇంకేముంటాయి.. అంటారా.. అవునులెండి.. కానీ మనకు తెలియకుండానే మనం ఇంకా ఏం తింటున్నామో తెలుసా.. అదే విషం.. ఏంటి షాకయ్యారా.. అవును.. నిజమే మనకు తెలియకుండానే మనం రోజూ కాస్త విషం తీసుకుంటున్నాం.. అయితే అది పూర్తిగా విషం కాదు.. ప్రాణాలు తీసేది కాదు.. కానీ మన జీవితాల్లో విషాదం నింపేది. మనల్ని ఒక్కసారిగా కాకుండా క్రమంగా అనారోగ్యం బారిన పడేసేది.

మరి ఇంతకీ ఆ విషం మన శరీరంలోకి ఎలా వస్తుందంటారా.. అదే మనం తినే కూరగాయలు, పండ్లు,ఇతర ఆహారపదార్ధాల ద్వారా ఈ విషం మనలో ప్రవేశిస్తోంది. సాగులో ఉపయోగించే పురుగు మందుల అవశేషాలు ఆహార పదార్దాల్లోకీ వస్తున్నాయి. ప్రత్యేకించి కూరగాయల విషయంలో ఇది ఎక్కువగా ఉంది. మరి రైతులు అధిగ దిగుబడి కోసం .. పంటలను తెగుళ్ల నుంచి కాపాడుకోవడం కోసం ఇలా పురుగు మందుల వాడుతున్నారు.

రైతులు పంటల సాగు సమయంలో విషపూరిత రసాయనాలను విస్తృతంగా చల్లుతున్నారు. అలా సాగు సమయంలోనే విషపూరిత రసాయనాలు పంటల్లోకి చేరిపోతున్నాయి.. ప్రత్యేకించి కూరగాయలు, పండ్ల ఉపతరాలపై పేరుకుపోతున్నాయి. మరి ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి.. సాధ్యమైనంత వరకూ రైతులు పురుగల మందుల వాడకం తగ్గించాలి. మరి అవి వాడకపోతే దిగుబడి తగ్గుతుంది.. అలా తగ్గకుండా రైతులు కొన్ని వ్యవసాయపద్దతలు పాటించాలి.

అవే.. పంట ఉత్పాదకతను పెంచడం, పశువుల ఉత్పాదకతను అధికం చేయడం, వనరుల వినియోగం, సాగువ్యయం తగ్గింపు, అధిక విలువ ఉన్న పంటల సాగు, వాటికి ఎక్కువ ధరలు వచ్చేలా చూడటం.. ఇలా చేయాలి.. దీని ద్వారా  వ్యవసాయంతో పాటు రైతులు ఇతర పనులను చేయడంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. అంతే కాదు..  వ్యవసాయాభివృద్ధి పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలి. రైతులు పంటలకు హాని చేయని..  జీవ పురుగుమందుల వాడాలి. అందుకే ఆర్గానిక్ పంటలకు డిమాండ్ పెరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: