రేగు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఖనిజాలు అందుతాయి. రేగుపళ్ళు ఎప్పుడంటే అప్పుడు దొరకవు. శీతాకాలంలో మాత్రమే దొరుకుతాయి. రేగు పళ్ళు తినడం వల్ల ఎముకలు, చర్మము, రక్త ప్రవాహం, హార్మోన్లు, కండరాలు,జుట్టు,శరీర ఎంజైములు, మరియున్యూరోట్రాన్స్మిటర్స్ తయారవడానికి సహాయ పడతాయి.రేగుపళ్లు లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

 శరీరానికి కావాల్సిన పోషకాలు రేగిపళ్ల లో పుష్కలంగా ఉన్నాయి. చిన్న రేగు పళ్ళు తీసుకోవడం వల్ల పొటాషియం, పాస్పరస్, మాంగనీస్, జింక్, ఐరన్ ఇవన్నీ శరీరానికి అందుతాయి.

 రేగు పళ్ళు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఐరన్ చాలా అవసరం. ఈ ఐరన్ ను రేగుపళ్ళు లో పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత తగ్గడానికి,రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి రేగు పళ్ళు బాగా ఉపయోగపడతాయి.

 అర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి తెలుగు పనులు తినిపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే రేగుపళ్లు లో క్యాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి.ఇవి ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతాయి.

 రేగు పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కీళ్ల వాపులు, నొప్పులు లతో బాధపడుతున్నవారు, రేగి పండ్లు తినడం వల్ల ఈ నొప్పులు తగ్గుతాయి.

 రేగుపళ్లు లో ఒత్తిడి తగ్గించే గుణాలు ఉంటాయి.చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి.యవ్వనంగా ఉండేట్లు చేస్తాయి. ఇంకా మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

బరువు తగ్గాలనుకునేవారు ఎన్ని పనులైనా తినవచ్చు. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గుతారు.

 ఎదుగుతున్న పిల్లలకు రేగు పళ్ళు తినిపించడం వల్ల మానసికంగా,శారీరకంగా బాగా ఉంటారు.

 రేగుపళ్లు లో ఉండే ఆల్కలాయిడ్స్ రక్తాన్ని శుద్ధి చేయడం తో పాటు శరీరంలో ఉండే తలను బయటకు పంపుతాయి.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధుల నుండి కాపాడుతాయి.                                                                                                                                                                                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: