బెండకాయ గురించి తెలియనివారు ఉండరు. ఎందుకంటే రోజు మనం వాడే కూరగాయల్లో ఇది ఒకటి
 బెండకాయలతో పులుసు చేసుకోవచ్చు, చట్నీ అయినా చేసుకోవచ్చు, గాలింపు చేసుకోవచ్చు, కూరలు చేయడమే కాకుండా వీటివల్ల బరువు తగ్గుతారు. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.క్యాలరీలు తక్కువగా ఉంటాయి.  కాబట్టి బెండకాయలు తీసుకోవడం వల్ల ఆకలి తక్కువగా ఉంటుంది. దీనివల్ల తక్కువ ఆహారం తింటారు. ఫలితంగా బరువు తగ్గుతారు.

 బెండకాయలో కరిగే ఫైబర్ పెక్టిన్ ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ చేరకుండా చేస్తుంది.కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నప్పుడు గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి బెండ కాయలు తినడం చాలా మంచిది.

 రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడానికి బెండకాయలు సహాయపడతాయి.భోజనం చేసిన తర్వాత షుగర్ వల్ల వచ్చే చిక్కులను తప్పించడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను సరేనా ఉండేటట్లు చేస్తుంది.

 బెండకాయలు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం లేకుండా చేస్తుంది.బెండకాయలను రోజా తీసుకోవడం వల్ల, పెక్టిన్ అనే పదార్థం పేగుల్లోని వ్యర్ధాలను బయటికి పంపడానికి సహాయపడుతుంది.

 బెండకాయలో పోలిక్ ఆమ్లం,పోలిట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గర్భం దాల్చడానికి సహాయపడతాయి. కాబట్టి పిల్లలు కావాలి అనుకునే మహిళలు చేసుకోవడం చాలా మంచిది.

బెండకాయలో సి సమృద్ధిగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది.కాబట్టి మనం తినే ఆహారంలో బెండకాయలను చేర్చుకోవడం మంచిది.

 బెండకాయలు రక్తహీనత నుండి కూడా రక్షిస్తాయి.  ఎందుకంటే బెండకాయలో ఐరన్ మరియు ఫోలేట్,విటమిన్ కె పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తహీనత నుండి కాపాడుతాయి.

 బెండకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను చెక్కుచెదరకుండా చేయడమే కాకుండా పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

 బెండకాయలో విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి.ఇవి కంటి చూపును మెరుగు పరచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.

 తలలో చుండ్రు మరియు పేల చికిత్సకు బెండకాయ బాగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే బెండకాయలను ముక్కలుగా కోసి నీటిలో బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం కలిపి జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య, పేల సమస్య తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: