ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బెల్లం పానకం ఎంత మంచిదో తెలుసా? మన పెద్ద వాళ్ళు మన పూర్వికులు తమ కాలంలో ఈ బెల్లం పానకాన్ని రోజు తాగేవారు. కాని ఈ ఆధునిక ప్రపంచంలో మనం చిరు తిండి తినటానికి బాగా అలవాటు పడి అనేక రోగాల భారిన పడుతున్నాం.అందుకే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. బెల్లం పానకం చాలా మంచిది.బెల్లం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బెల్లం మంచిదే. చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. చక్కెరతో పోల్చితే బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువ. అయితే, బెల్లన్ని నేరుగా తీసుకోకుండా.. గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని చూడవచ్చట. అదెలాగో చూడండి.బెల్లంలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి ఉంటాయి. నీటిలో వేసి వేడి చేయడం వల్ల మరింత మెరుగైన ఫలితం కనిపిస్తుంది.

మరి వెచ్చని బెల్లం పానకం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకోండి..బెల్లంలో ఉండే పోటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.గోరువెచ్చని బెల్లం పానకం తాగడం వల్ల ఉదయం వేళ్లల్లో మల విసర్జన స్మూత్‌గా జరుగుతుంది. కడుపులోని విషతుల్యాలన్నీ బయటకు పోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. ఎసిడిటీ, మలబద్దకం తదితర జీర్ణ సమస్యలను దూరంగా ఉంచుతుంది. బెల్లం లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మేలు చేస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరిస్తుంది. జీవక్రియను పెంపొందిస్తుంది. అయితే, బెల్లం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని స్పష్టంగా చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. అయితే, జ్వరంతో బాధపడేవారికి ఇది మాంచి ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తూ త్వరగా కోలుకోడానికి బెల్లం పానకం మంచిదట.బెల్లం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 కాబట్టి జ్వరానికి గుర్యయ్యే అవకాశాన్ని బెల్లం తగ్గిస్తుంది. బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ సీజనల్ వ్యాధులకు గురయ్యే ముప్పు నుంచి కాపాడతాయి. బెల్లంలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోగలవు. ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తిని ఇవ్వగలవు.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: