సాధారణంగా రాగి బిందెలు, రాగి చెంబులు అందరి ఇళ్ళలోనూ ఉంటాయి. ఆధునిక యుగంలో ప్లాస్టిక్ వాడకం పెరిగిన తర్వాత రంగురంగుల ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం అలవాటు చేసుకున్నారు. కానీ ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు అన్న విషయం మీకు తెలుసా !మన పూర్వికులు రాగి బిందె లో నీరు నిల్వ ఉంచుకొని రాగి చెంబుతో తాగడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు.  భారతీయ ఆయుర్వేదంలో రాగి వస్తువులకి ప్రత్యేక స్థానం ఇవ్వబడింది.

ప్రస్తుతం  మనం నీటిని శుద్ధి చేయడానికి ఆర్ఓ ప్యూరిఫైర్స్ , యూవీ ఫిల్టర్లు వాడుతున్నాము. కానీ   రాగి పాత్రలో  నీటిని నాలుగు గంటల పాటు నిల్వ ఉంచితే నీటిలోని హానికరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి. దీంతో పాటు రాగిలో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్,  మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి గుణాలు నీటిలో కలిసి స్వచ్ఛమైన నీరు మనకు అందిస్తాయి. రాగి పాత్రలో నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది.

ఆయుర్వేదం ప్రకారం  రాగి అనేది మనిషి శరీరానికి అవసరమయే మినరల్స్ లో ఒక్కటి  రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన కాపర్ సమృద్ధిగా లభిస్తుంది.

రాగి శరీరాన్ని శుభ్రపరిచి, డిటాక్స్ చేస్తుంది. అలాగే శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

కాపర్ శరీరంలో కొవ్వును కలిగించడంలో కీలక పాత్ర వహిస్తుంది. తద్వారా మన శరీర బరువు పెరగకుండా కాపాడుతుంది.

రాగిలోని యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
   
ప్రతిరోజు రాగి చెంబులో నీరు త్రాగడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉంచడంతో పాటు. రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
మళ్లీ ఈ మధ్య కాలంలో చాలామంది ప్లాస్టిక్ బాటిల్ ని పక్కన పడేసి కాపర్ బాటిల్స్, రాగి చెంబులో నీళ్లు తాగడం మొదలుపెట్టారు ఇది ఇది మంచి విషయమే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: