ఎక్కడ చూసినా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలం వస్తే చాలు,దోమలు గుంపులు గుంపులుగా వచ్చి దాడిచేస్తాయి. ఫలితంగా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఈ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి సమస్యల నుండి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అయితే దోమలను తరిమి కొట్టడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల దోమల నివారణ మందులు అయిన కాయిల్స్, ఆల్ అవుట్స్, గుడ్ నైట్ వంటి కంపెనీలు తయారు చేసిన మందులను తీసుకొచ్చి ఇంట్లో వాడుతుంటాము. అయితే ఇవి విడుదల చేసే కొన్ని రసాయనాల కారణంగా పిల్లల్లో ఆస్తమా, జలుబు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక మొక్కను తీసుకొచ్చి, ఇంట్లో ఉపయోగించడం వల్ల ఒక్క దోమ కూడా లేకుండా వెళ్లిపోతాయి. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే ఆ మొక్క ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మన ఇంటి ఆవరణలో, రోడ్డుకిరువైపులా విచ్చలవిడిగా పెరిగే ఒక మొక్క. అది ఏదో కాదు గడ్డి చామంతి. దీనినే కొన్ని ప్రదేశాలలో గాయపాకు అని పిలిస్తే, మరి కొన్ని ప్రదేశాల్లో రావణాసుర తల, పలక ఆకు అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఈ గడ్డి చామంతి మొక్క ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్ర,తెలంగాణలలో పల్లెటూరి ప్రాంతాలలో ఎక్కువగా ఎక్కడ చూసినా కనపడేది ఈ గడ్డి చామంతి మొక్కే.
గడ్డి చామంతి మొక్క ఆంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. పల్లెటూర్లలో ఎవరికైనా గాయం అయితే ఈ గడ్డి ఆకులను బాగా నలిపి, గాయమైన చోట కట్టులాగ కడతారు. ఇక గడ్డి చామంతి మొక్క యొక్క ఆకులకు మన ఇంట్లో ఉండే దోమలను తరిమికొట్టే క్రిమిసంహారక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకోసం ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి, వాటిని రెండు, మూడు రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. అలా ఎండబెట్టిన ఆకులను ఒక మట్టి పాత్ర తీసుకొని,అందులో వేసి వాటిపైన కర్పూరం ఉంచి వెలిగించాలి. అయితే ఈ మట్టి పాత్రలు మీ నట్టింట్లో పెట్టడం ఉత్తమం.
కర్పూరం వెలిగించినప్పుడు ఆ మంట తోపాటు ఆకులు కూడా మండి, ఆకులు కాలినప్పుడు వచ్చే పొగ దోమలకు అస్సలు పడదు. ఇక ఈ వాసన పీల్చుకున్న వెంటనే దోమలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకెందుకాలస్యం ఈ గడ్డి జాతి మొక్కను సేకరించి, వాటి ఆకులను ఎండబెట్టి ఇంట్లో పొగ పెట్టండి. ఇంట్లోనే కాకుండా మీ ఇంటి చుట్టు ప్రక్కల ఉన్న దోమలు సైతం పారిపోతాయి.