కరివేపాకును బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఈ పొడిని నిల్వచేసుకొని,కూరల్లో వేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది.
ప్లాస్క్ ని ఎంత అడిగినా దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మజ్జిగతో కడిగితే వాసన రాదు.                                                    

 బొంబాయి రవ్వ తో ఉప్మా చేసేటప్పుడు ఉండలు కడుతుంది.  అలా జరక్కుండా ఉండాలంటే బొంబాయి రవలోకి ఒక స్పూను నూనె కలిపితే సరిపోతుంది.

 వంటలు బాగా రుచిగా ఉండాలంటే,వంట చేసేటప్పుడు కారం తో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలకు మంచి రుచి వస్తుంది..

 సూప్ ను స్టవ్ మీద నుంచి దించిన తర్వాత రెండు స్పూన్లు పాల మీగడ కలిపితే చిక్కదనం తోపాటు మంచి రుచి వస్తుంది.

 బంగాళాదుంపలను తరిగిన తర్వాత రంగు మారకుండా ఉండాలంటే,ముక్కలపై వెనిగర్ చల్లితే రంగు మారవు.

 తేనె సీసా లో చీమలు రాకుండా అందులోకి నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు రావు.

 బెండకాయ కూర చేయడానికి ముందు బెండకాయ ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.

 వంకాయ కూర రంగు మారకుండా ఉండాలంటే, కూరలోకి రెండు చుక్కలు నిమ్మరసం పిండితే రంగు మారదు,  రుచి కూడా బాగుంటుంది

 గుడ్లను ఉడకబెట్టినప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు వేస్తే గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి.

 కిలో గోధుమలలో గుప్పెడు శనిగలు కలిపి మర పట్టిస్తే చపాతీలు తెల్లగా ఉండటమే కాకుండా రుచిగా కూడా ఉంటాయి.

రాగి సామాన్లను తోమే టప్పుడు వాటిపై నిమ్మరసం తల్లి ఉప్పుతో రుద్దితే తళతళా మెరుస్తాయి.

 పచ్చి బఠాణీలను ఉడికించేటప్పుడు అందులోకి చిటికెడు చక్కెర వేస్తే రంగు మారకుండా ఉంటాయి.

అల్లం, వెల్లుల్లిని రుబ్బేటప్పుడు వేయించి రుబ్బితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: