చిలగడ దుంపలను చాలామంది తినడానికి ఇష్టపడరు. వాటిలో ఉండే పోషకాలు తెలిస్తే తినకుండా ఉండరు. వీటిని ఉడికించి తీసుకోవచ్చు. కాల్చుకొని తినవచ్చు. పచ్చివి అయినా తినవచ్చు. ఎలా తిన్నా ఆరోగ్యానికి చాలా మంచివి. కనీసం వారానికి రెండు సార్లు అయినా తినడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. చిలకడ దుంపలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడమే కాకుండా శరీరంలో చేరిన విష పదార్థాలను బయటకు పంపుతుంది.అంతేకాకుండా అనేక రోగాలు రాకుండా చేస్తుంది. దుంపలు తినడం వల్ల మనకు కలిగే లాభాల గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...                                     

 చిలగడదుంపలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి చూపు తగ్గకుండా కాపాడుతాయి. అంతేకాకుండా ఎండ నుండి చర్మాన్ని కాపాడుతాయి.

 మధుమేహం ఉన్నవాళ్లు చిలకడ దుంపలు తినడం వల్ల శరీరంలో ఉండే చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

 చిలగడ దుంప లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం లేకుండా చేస్తుంది.మూత్రం సాఫీగా జరిగేటట్లు చేస్తాయి.

 చిలగడదుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న ఉప్పును తగ్గించి,అధిక రక్తపోటును తగ్గిస్తుంది.కాబట్టి చిలగడ దుంపలను అప్పుడప్పుడు తీసుకోవాలి.

 చిలగడ దుంపల్లో కెరోటినాయిడ్స్,బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విటమిన్ ఏ ను తయారుచేస్తాయి.ఇది కంటి చూపు మెరుగు పరచడానికి కాకుండా, నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది

 చిలగడదుంపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలను తయారు చేస్తుంది.అందుకే చిలగడ దుంపలను తీసుకోవాలి.

చిలకడ దుంపలు తినడం వల్ల పళ్ళు కూడా దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా పళ్ల చిగుళ్ల నుండి కారే రక్తాన్ని అరికడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: