ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగమైన సంగతి తెలిసిందే. ఉదయం లేవగానే ఆ రోజు సెల్ ఫోన్ తో మొదలవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేచిన వెంటనే ఎవరైనా ముందు టైం చూడటం కోసం ఫోన్ చూస్తారు. అక్కడ మొదలైన వాడకం రోజంతా ఏదో ఒక అవసరం కోసం వాడాల్సి వస్తుంది. అయితే కొందరు తమ పనులను సులభం చేసుకోవడానికి ఫోన్ లను ఉపయోగిస్తే మరి కొందరు టైమ్ పాస్ కోసమే ఫోన్ ను ఉపయోగిస్తుంటారు. గంటల తరబడి ఫోన్ లో గేమ్స్ ఆడటం సినిమాలు చూడటం లాంటివి చేస్తూ టైమ్ పాస్ చేస్తుంటారు. మరి కొందరు ఎక్కువ సమయం చాటింగ్ చేస్తుంటారు. అయితే ఫోన్ తో  ఎక్కువ సేపు ఛాటింగ్ చెయ్యటం..గేమ్ లు ఆడటం వల్ల చేతి వేళ్ళు నొప్పి పెడతాయి. ఇప్పుడు ఆ నొప్పులను ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం. చాటింగ్ చేస్తున్న సమయంలో ఒకే చేతిలో ఫోన్ ను పట్టుకుని కాకుండా ఒక చేతిలో పట్టుకుని మరో చేతితో చాటింగ్ చేయాలి. అంతే కాకుండా ఎక్కువసేపు కేవలం బొటనవేళ్ళతోనే చాటింగ్ చేయకుండా మిగతా వేళ్ళను కూడా ఉపయోగించాలి. అలా చేయటం వల్ల బొటన వేళ్ళు, చేతులు నొప్పి పెట్టవు. ఇక వేళ్ళు నొప్పి నుండి ఉపశమనం కోసం పిడికిలి బిగించి వేళ్ళను సాగదీస్తూ పైకి లేపాలి అలా లేపటం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే మెడ నొప్పి కూడా  వస్తుంది. అలా నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఫోన్ ను గడ్డానికి సూటిగా పట్టుకోవాలి. కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చుని ఫోన్ ను ఉపయోగించాలి. అంతే కాకుండా ఎక్కవ సేపు బ్రేక్ లేకుండా చాటింగ్ చేయకుండా మధ్య మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకోవడం వల్ల వేళ్ళకు రెస్ట్ దొరుకుతుంది. కాబట్టి వేళ్ళు నొప్పి పెట్టవు.

మరింత సమాచారం తెలుసుకోండి: