మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల, జీవన విధానాలు కారణంగా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతున్నాయి.అంతేకాకుండా అన్నం సరిగ్గా అరగకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి.వీటిని బాగా చేసుకోవడానికి కోసం డాక్టర్ల దగ్గరికి, మందుల షాపు కి వెళ్తుంటారు.అలా కాకుండా కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఆ చిక్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...                                     

 జీర్ణక్రియ క్రమంగా జరగడానికి, ఏ సమస్య రాకుండా ఉండడానికి ఈ విధంగా చేయాలి.రోజు చల్లని నీళ్ళకు బదులు వేడి నీళ్లు తాగుతూ ఉండాలి.భోజనం చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళు తాగుతుండాలి. ఈ విధంగా చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి సమస్య లేకుండా ఉంటుంది.

 భోజనం చేసేటప్పుడు ఏ పని మీద ఉండకుండా భోజనం మాత్రమే చేయాలి.వాతావరణం లో కూర్చొని తినడం చాలా మంచిది. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు టీవీ చూడకుండా ఉండటం మంచిది.

భోజనం చేసే ముందు ఒక చిన్న అల్లం ముక్క, నిమ్మరసం తీసుకోవడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఫలితంగా జీర్ణక్రియ సమస్యలు రావు.

 మధ్యాహ్న భోజనం సమయంలో ఒక గ్లాసు లస్సీ తీసుకోవడం చాలా మంచిది.దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు రావు.

 జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉండాలంటే,ఐస్ క్రీములు,శీతల పానీయాలు,చల్లని ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

 మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కడుపునిండా తినండి,కానీ రాత్రి భోజనం చేసేటప్పుడు మితంగా చేయడం మంచిది. రాత్రి భోజనం 8 గంటల లోపే చేయడమే మంచిది.

 భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం మంచిది. అంతేకాకుండా కొంచెం సేపు నడవడం చాలా మంచిది. అలాగే ఊపిరి బాగా పీల్చండి.

ఈ రోజు ఈ చిట్కాలను పాటించడం వల్ల సక్రమంగా జరగడమే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో మంట, ఉదర సంబంధిత సమస్యలురాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: